| YAHOO TELUGU NEWS |
| డీఎస్ పీఠాన్ని జగన్‌కి ఇవ్వండి: యువ ఎమ్మెల్యేలు..? |
| తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం అనంతరం డీఎస్ రాజీనామాకు ఒత్తిడి పెరుగుతోంది. అదే సమయంలో ఆయన స్థానంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కుమారుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కూర్చుండ బెట్టాలని మెజారిటీ యువ ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. |
|
| అపోహలు తొలగి ఉంటాయని భావిస్తున్నాం: ఐవీ |
| ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై ఉన్న అపోహలు పూర్తిగా తొలగి పోయి ఉంటాయని భావిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఐ.వి.సుబ్బారావు అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమై శనివారం తెల్లవారుజాము నాలుగు గంటలకు ముగిసిందన్నారు. |
|
| ఇషాన్‌రెడ్డి మృతదేహం వద్ద కంటతడి పెట్టిన కేసీఆర్ |
| తెలంగాణ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన అభ్యర్థులు గెలుపొందినందుకు మైసమ్మ తల్లికి ఆత్మబలిదానం చేసుకున్న ఇషాన్ రెడ్డి మృతదేహాం వద్ద తెరాస అధినేత కె.చంద్రశేఖర రావు కంటతడిపెట్టారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంసీఏ చదువుతున్న ఈ విద్యార్థి శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. దీంతో కేసీఆర్ ఓయూ క్యాంపస్‌కు వచ్చి విద్యార్థి మృతదేహానికి నివాళులర్పించే సమయంలో కంట తడిపెట్టుకున్నారు అనంతరం అక్కడే కొద్దిసేపు బైఠాయించారు. |
|
| ఈ దేశానికి గుజరాత్ శత్రువా: కేంద్రానికి మోడీ ప్రశ్న! |
| సొహ్రాబుద్దీన్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసు విచారణను మరో రాష్ట్రానికి మార్చాలని కేంద్ర పరిశోధనా సంస్థ (సీబీఐ) కోరనున్నట్టు మీడియాలో వస్తున్న వార్తలపై గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మండిపడ్డారు. ఈ కేసును తమ రాష్ట్రం నుంచి బదిలీ చేస్తే.. అది తమ రాష్ట్ర న్యాయవ్యవస్థనే కించపరిచినట్టని ఆయన అన్నారు. అంతేకాకుండా, దేశంలో అంతర్భాగమైన గుజరాత్.. ఈ దేశానికి శత్రువా అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు. గుజరాత్ భారతావనిలో ఒక అంతర్భాగంగా మీరు గుర్తించడం లేదా అని అడిగారు. |
|
| ఇరాన్ గ్యాస్ రంగంలో చైనా 40 బిలియన్ల పెట్టుబడులు! |
| ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొంటున్న ఇరాన్‌లో 40 బిలియన్ అమెరికా డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు చైనా ముందుకు వచ్చింది. ఇరాన్ ఆయిల్, గ్యాస్ రంగాల్లో చైనా పెట్టుబడి పెట్టనున్నట్టు ఇరాన్‌కు చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. |
|
| తెరాస గెలిచినందుకు ఓ విద్యార్థి ఆత్మ బలిదానం |
| తెలంగాణా ఆకాంక్ష నెరవేరాలని కోరుతూ మరో విద్యార్థి ఉస్మానియా యూనివర్శిటీలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిజామాబాద్ స్థానంలో డీ. శ్రీనివాస్ ఓడి అన్ని స్థానాల్లో తెలంగాణా రాష్ట్ర సమితి తిరిగి విజయం సాధిస్తే తనను తాను ఆత్మార్పణం చేసుకుంటానని మెదక్‌కు చెందిన విద్యార్థి ఇషాంత్ రెడ్డి తన సూసైడ్ నోట్‌లో రాసి పెట్టాడు. |
|
| ఎయిర్ బ్లూ విమాన ప్రమాదంలో బ్లాక్‌బాక్స్ గుర్తింపు! |
| ఇటీవల పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ సమీపంలోని మార్గాల పర్వత శ్రేణుల్లో జరిగిన ఎయిర్ బ్లూ విమాన ప్రమాదంలో బ్లాక్‌బాక్స్‌ను సహాయక బృందాలు శనివారం కనుగొన్నారు. దీన్ని విశ్లేషించడం ద్వారా ప్రమాదానికి గల కారణాలు తెలియవచ్చని సహాయ బృంద అధికారులు చెపుతున్నారు. |
|
| అమెరికాలో మూతపడిన మరో ఐదు బ్యాంకులు! |
| ప్రపంచ ఆర్థిక మాంద్యం నుంచి అమెరికా బ్యాంకులు ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. శుక్రవారం మరో ఐదు బ్యాంకులు మూతపడ్డాయి. దీంతో ఇప్పటి వరకు మూతపడిన బ్యాంకుల సంఖ్య 108కు చేరుకుంది. మూత పడిన ఐదు బ్యాంకులు వాయువ్య, నైరుతి అమెరికా ప్రాంతాల్లో ఉన్నాయి. |
|
| భారత్‌లో 2020 నాటికి నీటి కొరత: అమెరికా హెచ్చరిక |
| శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రెండో స్థానంలో ఉన్న భారత్‌లో మరో పదేళ్ల తర్వాత తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడుతుందని అమెరికా హెచ్చరించింది. రాష్ట్రాల మధ్య నెలకొనే నీటి, సరిహద్దు సమస్యల కారణంగా ఈ నీటి కొరత నెలకొంటుందని అమెరికా విదేశాంగ సహాయ మంత్రి రాబర్ట్ బ్లేక్ అభిప్రాయపడ్డారు. |
|
| కామన్వెల్త్ క్రీడల ఏర్పాట్లపై కార్యదర్శితో సమీక్ష: పీఎంఓ |
| కామన్వెల్త్ క్రీడల ఏర్పాట్లలో తీవ్ర జాప్యం జరుగుతోందని వస్తున్న వార్తలపై ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుంది. ఏర్పాట్లపై కేబినెట్ కార్యదర్శితో సమీక్ష చేయాల్సిందిగా పీఎంఓ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేబినెట్ సెక్రటరీ కె.ఎం.చంద్రశేఖర రంగంలోకి దిగి కామన్వెల్త్ క్రీడల ఏర్పాట్లపై సమీక్ష చేసి పీఎంఓకు నివేదిక సమర్పించనున్నారు. |
|
| కాంగ్రెస్ ఉప్పు నీటిలో జగన్ మంచినీటి బిందువు: అంబటి |
| కాంగ్రెస్ అనే ఉప్పునీటి సముద్రంలో వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఒక మంచినీటి బిందువు అని సస్పెండ్‌కు గురైన పీసీసీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం ఈ విషయాన్ని గుర్తించి అంబటి సేవలను పార్టీకి వినియోగించుకోవాలని ఆయన సూచించారు. |
|
| పాకిస్థాన్‌లో భారీ వరదలు: 400 మందికి పైగా మృతి! |
| పాకిస్థాన్‌ను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరద కారణంగా ఇప్పటి వరకు సుమారు 400 మంది పైగా మరణించారు. మరో నాలుగు లక్షల మంది వరకు నిరాశ్రయులైనట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. అలాగే ఆప్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. వీటికి మరో 60 మంది మృతి చెందారు. |
|
| కాశ్మీర్‌లో మళ్లీ చెలరేగిన అల్లర్లు: నలుగురి మృతి! |
| కాశ్మీర్ లోయలో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. ఫలితంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కాశ్మీర్ లోయలోని ప్రధాన ప్రాంతాల్లో నిరవధిక కర్ఫ్యూను విధించారు. నలుగురి మృతితో ఆగ్రహోద్రుక్తులైన స్థానికులు రోడ్లపైకి వచ్చి భద్రతా దళాలతో తలపడ్డాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. |
|
| సెయిల్ పెట్టుబడుల ఉపసంహరణకు తీవ్ర వ్యతిరేకత! |
| స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్)లో పెట్టుబడుల ఉపసంహరణకు అన్ని కార్మిక సంఘాల యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ విషయాన్ని శుక్రవారం జరిగిన రాజ్యసభ సమావేశాల్లో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఏ.సాయి ప్రతాప్ వెల్లడించారు |
|
| తెదేపాకు వ్యతిరేకంగా రాజకీయ కుట్ర: ఎర్రబెల్లి దయాకర్ |
| ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసేందుకు గాను రాజకీయ కుట్ర సాగుతోందని ఆ పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ఈ కుట్రలో తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీలు పాలు పంచుకుంటున్నాయని ఆయన సందేహం వ్యక్తం చేశారు. |
|
| తెలంగాణ అంశం సర్వరోగ నివారిణి కాదు: జయప్రకాష్ |
| రాష్ట్ర విభజనపై నెలకొన్న సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ అంశం సర్వరోగ నివారిణి కాదని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఉప ఎన్నికల్లో ఓటర్లను డబ్బు, మద్యం వంటి అంశాలు ఓటర్లను ఏమాత్రం ప్రభావితం చేయలేదన్నారు. అదేసమయంలో ఆ ప్రాంత ప్రజలు ఆగ్రహావేశాలతో ఉన్నారని, అందువల్ల ప్రస్తుతం తెలంగాణ అంశంపై స్పందించడం మంచిది కాదన్నారు. |
|
| సెంటిమెంట్ వల్లే తెరాస అభ్యర్థుల విజయం: పురంధేశ్వరి! |
| తెలంగాణ ప్రాంత ప్రజల్లో సెంటిమెంట్ బలంగా ఉండటం వల్లే తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు ఘన విజయం సాధించారని కేంద్ర సహాయ మంత్రి పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు. ఆమె శనివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉప ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రతి ఒక్కరూ ప్రతి రాజకీయ పార్టీ గౌరవించి తీరాలన్నారు. |
|
| బ్లూ స్టార్ తొలి త్రైమాసిక ఆదాయంలో 25 శాతం వృద్ధి! |
| సెంట్రల్ ఎయిర్ కండీషనింగ్ అండ్ కమర్షియల్ రిఫ్రిజెరేషన్ సంస్థ బ్లూ స్టార్ లిమిటెడ్ 2010-11 ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసిక ఫలితాలను తాజాగా వెల్లడించింది. గత యేడాది తొలి త్రైమాసిక ఫలితాల ఆదాయంతో పోల్చితే ఈ యేడాది 25 శాతం మేరకు వృద్ధి చెందినట్టు ఆ సంస్థ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. |
|
| ఉత్తర చైనాలోని బొగ్గు గనిలో పేలుడు: 15 మంది మృతి! |
| ఉత్తర చైనాలోని ఒక బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి 15 బొగ్గు గని కార్మికులు మృత్యువాత పడ్డారు. చైనాలోని బొగ్గు గనుల్లో ఈ వారంలో జరిగిన రెండో అతిపెద్ద ప్రమాదం ఇదే కావడం గమనార్హం. |
|
| పలు రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేసిన ఈసీ! |
| వివిధ రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే, కేంద్ర మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) పార్టీ జాతీయ గుర్తింపును కూడా ఈసీ రద్దు చేసింది. మరో ఐదు పార్టీలు వివిధ రాష్ట్రాల్లోని పార్టీ గుర్తింపును కూడా కోల్పోయాయి. |
|